డబ్బు సంపాదించటంలో స్టాక్ ట్రేడింగ్ అనేది చాలా మంచి మార్గము. ఇండియా మొత్తంలో ఎన్ ఎస్ ఈ, బి ఎస్ ఈ స్టాక్ ఎక్సేంజ్లు రెండు బాగా ట్రేడ్ అవుతాయి. ఎవరైనా ట్రేడింగ్ చేయాలంటే వారికీ ఏదో ఒక డీపాసిటరి పార్టీసీపెంట్స్ (డీ.పీ.)తో డీ-మాట్(డీ మటేరిఅలిజేడ్) ఎకౌంటు ఉండాలి. డీ-మాట్ ఎకౌంటు అనేది స్టాక్ సేవింగ్ ఎకౌంటు. అనగా దీనిలో డబ్బుల బదులు స్టాక్స్ సేవ్ చేసుకోవచ్చు. డీ-మాట్ ఎకౌంటు ఓపెన్ చేసిన తరువాత మనం స్టాక్స్ కొనటం అమ్మటం లాంటివి చేసుకోవచ్చు. డీపాసిటరి పార్టీసీపెంట్స్ వివరాల కొరకు ఇచట క్లిక్ చేయుము.
బ్రోకేర్ కి డీ.పీ. కి తేడా ఉంది. డీ.పీ. మన షేర్స్ ని స్టోర్ చేయటానికి కావలసిన అకౌంట్ ని ఇస్తుంది. బ్రోకేర్ మన తరపున ఎక్సేంజ్ లో నుండి షేర్ లను కొనటం అమ్మటం చేస్తాడు. ఇండియా లో చాలా వరకు బ్యాంక్స్ బ్రోకరేజ్ హౌస్ లాగ పని చేస్తాయి. బ్యాంకు లే కాకుండా చాల ప్రైవేటు బ్రోకరేజ్ హౌసెస్ ఉన్నాయి. ఉదాహరణకు ఇండియా బుల్ల్స్, షేర్ ఖాన్, రిలయన్స్ మనీ, ఇండియా ఇన్ఫోలైన్ లు కొన్ని.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment