Monday, January 19, 2009

ట్రేడింగ్ లో డబ్బులు పోయే పది రకాలు

ప్రతి ట్రేడర్ కి ట్రేడింగ్ లో లాభ నష్టాలు రావటం సాధారణ విషయం. సరిఅయిన ట్రేడర్ చేసిన తప్పుల నుండి నేర్చుకొని మళ్లీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. క్రొత్త ట్రేడర్స్ ట్రేడింగ్ నేర్చుకోవటానికి డబ్బులతో రిస్క్ చేసే బదులు పాత ట్రేడర్ యొక్క సలహాలు తీసుకోవటం చాల ఉత్తమం. ఈ క్రింది విషయాలు నాకు మరియు చాలా మంది అనుభవజ్ఞులైన ట్రేడర్స్ కి ఎదురయ్యే విషయాలు. ఇది చదవటం వల్ల, ఇలాంటి తప్పులు పునరావ్రతం చేయకుండా ఉండటమే కాకుండా అసలు మొదట్లోనే ఈ తప్పులు చేయకుండా ఉండొచ్చు.


1. విషయ పరిజ్ఞానం లేకుండా మొదట్లోనే ఇంట్రా డె ట్రేడింగ్ లాంటి రిస్క్ ఎక్కువ ఉన్న వాటిలోకి వెళ్ళకూడదు. ఎవరైనా పుస్తకాల నుండి గాని, కోర్సస్ నేర్చుక్‌కోవటం ద్వారా గాని ఎంత విషయం నేర్చుకున్నా మంచి స్ట్రాటజీ (యుక్తి) ఇంట్రా ట్రేడింగ్ లో ఉపయోగించుట కొరకు చాలా సమయం పడుతుంది. కొత్తగా ట్రేడింగ్ లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బును 85% మీడియం / లాంగ్ టర్మ్ మంచి స్టాక్స్ లో పెట్టి కేవలం 15% మాత్రం ట్రేడింగ్ కొరకు ఉపయోగించటం మంచిది.

2. మార్కెట్ యొక్క ట్రెండ్ కి వ్యతిరేకంగా వెళ్ళటం వల్ల సులభంగా డబ్బు పోయే అవకాశం ఎక్కువవుతుంది.
మార్కెట్ యొక్క ట్రెండ్ కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అలా వెళ్ళటం వల్ల ఒకటి రెండు సార్లు డబ్బు వచ్చే అవకాశం ఉన్నా ఎక్కువ శాతం (దాదాపు 80% వరకు) డబ్బు పోయే అవకాశాలే ఉంటాయి.

3. అర్థం కాకున్నా జటిలమయిన టెక్నిక్స్ నేర్చుకోవటానికి ప్రయత్నించి వాటిని పరీక్షించకుండానే ట్రేడింగ్ కి ఉపయోగించటం అనేది డబ్బులు పోవటానికి ఇంకో మార్గం.
ట్రేడింగ్ చేయటానికి ఎప్పుడయినా, అర్థం అయ్యీ కానీ జటిలమయిన టెక్నిక్స్ వాడే బదులు, బాగా తెలిసిన చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించటం చాలా చాలా మంచిది. ఈ జటిలం అయిన టెక్నిక్స్ ఎక్కడ ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. లేకపోతే అసలు అలాంటి టెక్నిక్స్ వాడటమే మంచిది కాదు. సగం తెలిసి ఉన్న జ్ఞానం చాలా అపాయం.


4. టీవీ చూసి, వాళ్ళు ఊహించి చెప్పే మార్గాలను వాడటం అనేది మార్కెట్ లో డబ్బు పోవటానికి ఇండియాలో చాలా మంది చేసే సాదారణ తప్పు.

వచ్చిన నష్టాల నుండి తొందరగా బయట పడే ఒత్తిడి లో చాలా మంది CNBC TV18, NDTV profit, UTVi లాంటి చానల్స్ చూస్తూ వాళ్ళు చెప్పేవి గుడ్డిగా ఏమీ ఆలోచించకుండా ఆచరించి ఇంకా నష్టాల పాలు అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి చానల్స్ చూడటం మంచిదే కానీ, 24 గంటలు అదే చూస్తూ ఉండటం కచ్చితంగా మంచిది కాదు. ఇందులో వచ్చే కొన్ని కార్యక్రమాలు బాగుంటాయి. ఇందులో వాళ్ళు కొని సూచనలు చేస్తారు, కానీ మనం గుర్తు ఉంచుకోవలసింది అవి సిఫారసు మాత్రం కాదు అని. నిపుణులు ఎప్పుడు భవిష్యత్ ని అంచనా వేయరు. వాళ్ళు మార్కెట్ యొక్క ట్రెండ్ ని గమనించి దాని ద్వారా డబ్బును సంపాదిస్తారు.

No comments:

Post a Comment